ఈ మనోహరమైన అద్భుతమైన రాత్రి
నా హృదయాన్ని వెతుక్కుంటూ వచ్చే
నీ హృదయం కోసం వేచిచూస్తున్నా .
నా ప్రియతమా రా రా..
అనుక్షణం నా ప్రేమను..
నీకు పరిచయం చేయాలని,
నన్నే నీకు ఇచ్చుకోవాలని,
నీ గుండెకు దగ్గరగా నిలిచిపోవాలని,
నీ గుండె చేసే చప్పుడు వినాలని,
నా ప్రియతమా రా రా..
నా హృదయం మరియు ఆత్మ లో
ఒకటి కావాలనే ప్రేమగల తీపి కోరిక,
కాంతి జ్వాలలు నీడలో,
పెనావేసుకున్న బంధం,
అందమైన నీ నీడలో,
మన ఇద్ధారం జీవితం కొనసాగాలి,
నా ప్రియతమా రా రా..
ఈ తరుణాన్ని ఆనందంగా ఆస్వాదించడం
కోసం సిరిమల్లె పువ్వులాంటి నీ సఖి నీ కోసం ఊహల కోటలో సన్నజాజిపందిరి కింద ఎదురుచూస్తునది..
నా ప్రియతమా రా రా..
No comments:
Post a Comment