web stats analysis

Thursday, June 20, 2019

Love and Desire


ఈ మనోహరమైన  అద్భుతమైన  రాత్రి నా హృదయాన్ని వెతుక్కుంటూ వచ్చే నీ హృదయం కోసం వేచిచూస్తున్నా . నా ప్రియతమా రా రా.. అనుక్షణం నా ప్రేమను.. నీకు పరిచయం చేయాలని, నన్నే నీకు ఇచ్చుకోవాలని, నీ గుండెకు దగ్గరగా నిలిచిపోవాలని, నీ గుండె చేసే చప్పుడు వినాలని, నా ప్రియతమా రా రా.. నా హృదయం మరియు ఆత్మ లో  ఒకటి కావాలనే ప్రేమగల తీపి కోరిక, కాంతి జ్వాలలు నీడలో, పెనావేసుకున్న బంధం, అందమైన  నీ  నీడలో, మన ఇద్ధారం జీవితం కొనసాగాలి, నా ప్రియతమా రా రా.. ఈ తరుణాన్ని  ఆనందంగా ఆస్వాదించడం  కోసం సిరిమల్లె పువ్వులాంటి  నీ  సఖి నీ కోసం  ఊహల కోటలో  సన్నజాజిపందిరి కింద ఎదురుచూస్తునది.. నా ప్రియతమా రా రా..
allvoices

Monday, March 18, 2019

My Love...My Faith....


💞 నా ప్రేమ నా నమ్మకం 💞 ఎంతటి కోపం నీ కళ్ళలో ఎంతటి కఠినత్వం  నీ మాటల్లో అన్ని తట్టుకున్నది  మనసు ఎందుకంటే  అంత ప్రేమ నువ్వంటే ఎన్ని రోజుల  నీ మౌనం ఎన్ని రోజుల నీ ఎడబాటు  సర్దుకుపోతున్నది నా హృదయం ఎందుకంటే అంత ప్రేమ నువ్వంటే నీతో మాటలే లేక గడిపిన  రోజులకన్నా  నీ ఊహలతోటి  నా మాటలు కలిపినా రోజులే  ఎక్కువ ఎందుకంటే అంత ప్రేమ నువ్వంటే ఒంటరిగా నన్ను వదిలిన  వేళ నీ జ్ఞ్యాపకాలతో చెప్పిన కథలెన్నో ఎందుకంటే అంత ప్రేమ నువ్వంటే బాధపడుతున్న నా మనసుకు నీ పలకరింపులే సంతోషం జారుతున్న నా కన్నీటికి  నీ చేతులే ఓదార్పు  ఎందుకంటే అంత ప్రేమ నువ్వంటే అర్థం చేసుకుని ఎప్పటికైనా నన్ను చేరుకుంటావని ఎదురుచూస్తున్నది హృదయం 💞ఎందుకంటే అంత నమ్మకం నా ప్రేమంటే💞
allvoices